Paidi Jairaj Preview Theatre

Paidi Jairaj Preview Theatre A preview theater Maintained by Dept. Of Language and Culture, Telangana Government located at Heart of the City in Ravindra Bharathi 2nd Floor, Hyderabad
(221)

తెలంగాణ సినిమా కోసంసినిమా సమస్త కళల సమాహారం. దర్శకుడితో మొదలై కథకుడు, నటీనటులు, ప్లేబ్యాక్‌ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్...
24/02/2025

తెలంగాణ సినిమా కోసం

సినిమా సమస్త కళల సమాహారం. దర్శకుడితో మొదలై కథకుడు, నటీనటులు, ప్లేబ్యాక్‌ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఆర్ట్, వీఎఫ్‌ఎక్స్, డబ్బింగ్‌.. ఇలా విభిన్న కళాకారుల సమిష్టి కృషి సినిమా. నటనతో పాటు భిన్న దృక్పథాలతో సినిమా రంగంలోకి ఎందరో వస్తారు. ఇబ్బందులు పెడుతున్న పేదరికం, అవకాశాలకోసం కాళ్ళు అరిగేలా తిరగడం, యాక్టింగ్ సెంటర్ ల చుట్టూ తిరగడం, సగం నిండిన కడుపును అరచేతి గుప్పిట్లో దాచుకొని కళనే తమ జీవిత పరమార్థం అనుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టేవారు ఎందరో. కనీసం ఒక్కసారైనా తమ పేరును తెరమీద చూసుకోవాలనే వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్నా కళాకారులకు ఎక్కడో ఒకచోట సాయం అందాలి. సినీరంగం వైపు అడుగులేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి. ఆ ఆపన్నహస్తాన్ని అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. ఇందుకుగాను ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నిపుణులైన సినిమా పెద్దల సలహా సూచనలు మేరకు వర్థమాన నటులకు, దర్శకులకు, లిరిక్, స్క్రిప్ట్ రైటర్ లకు తనదైన శైలిలో వేదికను ఏర్పాటు చేసింది. నూతన ఔత్సాహికులకు
గుర్తింపు లభించే విధంగా కొత్త కొత్త శిబిరాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుంది. ఈక్రమంలోనే తెలంగాణ బిడ్డ, సినీ వైతాళికుడు పైడి జయరాజ్ యాదిలో రవీంద్రభారతిలోని థియేటర్‌కు పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ అని నామకరణం చేసి యువతరం తీసిన షార్ట్‌ ఫిల్మ్స్ మరియు డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించేందుకు అవకాశాలను కలిగించి వారి నైపుణ్యాలను, లోపాలను ఇదే వేదికపై తెలియజేసి చక్కని మార్గదర్శనం కోసం ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, సినీ ప్రముఖులు, నిపుణులు, ప్రముఖ సినీ విమర్శకులతో చర్చా గోష్టిని నిర్వహిస్తున్నారు.

ప్రతిభావంతులైన నటులకు, దర్శకులకు, రైటర్ లకు సినిమా అవకాశాలు లభించేలా ఒక దారిని చూపిస్తున్నది ఈ థియేటర్. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పోరాటాలు, యధార్థగాథలతో పాటు నేటి మోడ్రన్‌ కమర్షియల్‌ సినిమాల నాణ్యతను పరిచయం చేసేలా సరికొత్త రీతిలో ముందడుగు వేసింది.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ మూడవ వెర్షన్‌ను సగర్వంగా పున: ప్రారంభిస్తుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా, సినివారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మార్గదర్శక వేదికగా గొప్ప విజయాన్ని సాధించింది. నిత్యం ప్రభవిస్తున్న ప్రతిభను, కళాకారులను గుర్తిస్తూ పదిహేను మంది నవ యువ దర్శకులను, వందలాది మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను తెలుగు చిత్ర పరిశ్రమకి అందించింది, ముందు ముందు కూడా అందించబోతుంది. సినివారం కొత్త వెర్షన్ తో అవకాశాలను మరింత విస్తరించడానికి, కళాత్మక నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు ఆశావహ దర్శకులు , సినీప్రేమికుల కోసం మరింత ఉత్సాహవంతమైన వ్యవస్థను సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో భాషా సాంస్కృతిక శాఖ చిత్రనిర్మాతలు, కళాకారులు మరియు తెలుగు సినిమా ఔత్సాహికులందరినీ ఆహ్వానిస్తోంది. మీరు తీసిన లఘు చిత్రాలు, ఫీచర్ ఫిల్మ్ లను వాటి సంక్షిప్త కథ, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలతో మాకు పంపించండి. నిపుణులు వాటిని చూసి, ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శించబడతాయి.

సినిమాలు, కళల ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతిభావంతుల కోసం ఈ థియేటర్ తలుపులు తెరిచే ఉంటాయి. మీ చలన చిత్రాల ప్రదర్శనకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సృజనాత్మకతను శాఖవారు గౌరవించడమే కాదు యువతరం మేధోసృష్టికి ఒక ఫ్లాట్ ఫార్మ్ ఏర్పాటు దిశగా ఈ థియేటర్ నిర్మాణం జరిగింది.

తెలంగాణ సినిమా కు కథ బలం ఉన్న మంచి సినిమాలు ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ తిరిగి పునః ప్రారంభం కాబోతున్నది. సినీవారంగా ప్రారంభమైన ఈ వేదిక ఒక థియేటర్‌ను నిర్మించుకుని పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌గా మారింది. ఈ వేదిక నుంచి సినీవారం, సండే సినిమా, ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, టాక్‌ ఎట్‌ సినీవారం ఇలా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ వేదిక నుంచి సినిమా రంగానికి సంబంధించి 24 క్ట్రాఫ్టుల్లో నైపుణ్యాలు నేర్చుకున్న వారిలో చాలామంది డైరెక్టర్లుగా, టెక్నిషియన్లుగా, నటీనటులుగా మారారు. వీళ్లంతా మంచి పొజిషన్లలో ఉన్నారు. ఇదంతా పైడి జయరాజ్‌ థియేటర్‌ ద్వారా సాధ్యమైంది. ఈ ఆలోచనకు అంకురార్పణ చేసింది భాషా సాంస్కృతిశాఖ సంచాలకులు హరికృష్ణ. సినిమాపై ముఖ్యంగా తెలంగాణ సినిమాపై తనకు ఉన్న ఇష్టం వారిని దీనికి పురికొల్పింది. ఇది ట్రైనింగ్‌ సెంటర్‌గా మారింది. టాలెంట్‌ ఉంటే సినిమాకు సంబంధించి కొన్ని మెళకువలు నేర్చుకుంటే రాణించవచ్చు. అవకాశాలు పొందవచ్చు అన్నది ఈ వేదిక ద్వారా హరికృష్ణ చూపెట్టారు. అందుకే సినిమా అవకాశా కోసం స్టూడియోల చుట్టే తిరగాల్సిన అవసరం లేదని ప్రత్యామ్నాయ వేదికను నెలకొల్పారు. ఇలా అనేక కార్యక్రమాలు పురుడు పోసిన ఈ వేదిక కొవిడ్‌ సమయంలో ఒక సారి బంద్‌ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల మరోసారి ఆగిపోయింది. మూడోసారి కొత్తగా ఈ వేదిక పునః ప్రారంభం కాబోతున్నది. సినీ వారం, సండే సినిమా, ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఫిల్మోత్సవం, టాక్‌ ఎట్‌ సినివారం, చిత్రోత్సవం, తెలంగాణ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి పైడి జయరాజ్‌ తిరిగి తిరిగి స్వాగతం పలుకబోతున్నది.

సినీ వారంలో షార్ట్‌ ఫిల్మ్‌లు వేస్తారు. సండే సినిమాలో వరల్డ్‌ సినిమాలు ప్రదర్శిస్తారు. ఫెంటాస్టిక్‌ ఫైవ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రేట్‌ ఇండియన్‌, వరల్డ్‌ సినిమాలు. కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, జపాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇరాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మల్లి నిర్వహించబోతున్నాం . అవతరణ ఫిల్మోత్సవం. బతుకమ్మ ఫిల్మోత్సవం లో కొత్త తెలంగాణ సినిమాలను ప్రదర్శిస్తాం. టాక్‌ ఎట్‌ సినీ వారంలో ప్రతి శనివారం ఒక డైరెక్టర్‌ను తీసుకొచ్చి వారి అనుభవాలు పంచుకున్నారు. సందీప్‌రెడ్డి వంగా, హరీశ్‌ శంకర్‌, వంశీ పైడిపెల్లి, తరుణ్‌ భాస్కర్‌, వేణు ఊడుగుల ఇలా చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ డైరెక్టర్లు వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. దీనిద్వారా ఔత్సాహిక డైరెక్టర్లకు సినిమాకు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన కల్పించాం. ఈ రెండు ఏండ్ల కాలం లో వచ్చిన నూతన ధర్శకులతో దాన్ని కొనసాగిస్తాం చిత్రోత్సవం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి మంచి కార్యక్రమం జరిగినప్పుడు దానిపై షార్ట్‌ ఫిల్మ్‌ కంటెస్ట్‌లు పెట్టాం. అందులో పాల్గొన్నవారికి గిఫ్టులు ఇచ్చి సత్కరిస్తాం. ప్రత్యామ్నాయ సినిమాను, మంచి సినిమాను, కమర్షియల్‌ సినిమాల్లోనూ హ్యూమన్‌ యాంగిల్‌ ఉండాలనే ఫిల్మ్‌ తెలంగాణ రూపొందించాలన్నది ఈ వేదిక ముఖ్య ఉద్దేశం

రండి!ఈ వేదిక లో భాగస్వాములు కండి!
మీ సినిమా కలను సాకారం చేసుకునే దిషగా అడుగేయండి!!!

Cine week : ప్రతి శనివారం ఇక సినీ వారంABN , Publish Date - Feb 23 , 2025రవీంద్రభారతి (ఆంధ్రజ్యోతి)సర్వ కళల సమాహారం సినిమ...
23/02/2025

Cine week : ప్రతి శనివారం ఇక సినీ వారం
ABN , Publish Date - Feb 23 , 2025
రవీంద్రభారతి (ఆంధ్రజ్యోతి)

సర్వ కళల సమాహారం సినిమా.. తెరపై తమ పేరు చూసుకోవాలనుకునే కళాకారుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలంటే ఎక్కడో సాయం అందాలి.. సినీ రంగం వైపు అడుగులు వేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి. ఈ ప్రయత్నంలో ఉన్న వారికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంచి అవకాశం కల్పిస్తోంది. రవీంద్రభారతిలోని థియేటర్‌కు పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ గా నామకరణం చేసి యువతరం తీసిన షార్ట్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శింపజేస్తున్నారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంచాలకుడు మామిడి హరికృష్ణ నేతృత్వంలో 2016లో సినివారం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రతి శనివారం సినివారం’ పేరిట ప్రారంభమైన ఈ వేదికపై వందలాది లఘు చిత్రాలను ప్రదర్శించారు. తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ దర్శకులను ఆహ్వానించి ఈ వేదికపై చర్చా గోష్టి నిర్వహించారు. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కమ్ముల, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, ఎన్‌.శంకర్‌, నర్సింగరావు, తరుణ్‌ భాస్కర్‌, వేణు ఊడుగుల, ప్రవీణ్‌ సత్తారు, శ్రీనాథ్‌, సందీప్‌ రెడ్డి వంగా, సంకల్ప్‌ రెడ్డి, వీ.ఎన్‌.ఆదిత్య, బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖలతో ఔత్సాహిక కళాకారులతో ఇంటరాక్షన్‌ నిర్వహించారు. ఈ ప్రయాణంలో భాగంగా సినివారం ఇప్పుడు 3వ వెర్షన్‌ను పునః ప్రారంభించింది.

సినివారం టు సినిమా దర్శకులుగా..
సినివారం వేదికగా తమ షార్ట్‌ ఫిల్మ్‌లను ప్రదర్శించిన వారు పెద్ద సినిమాలతో దర్శకులుగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇప్పటివరకూ 15మంది దర్శకులు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడం విశేషం. వీరి ఫోటోలు పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ హాల్‌లో ఏర్పాటు చేశారు. తరుణ్‌భాస్కర్‌ (పెళ్ళిచూపులు), కేవీఆర్‌ మహేంద్ర(దొరసాని), సాహిత్‌ మోత్కూర్‌ (సవారి), ఉదయ్‌ గుర్రాల (మొయిల్‌), బడుగు విజయ్‌కుమార్‌ (తమసోమ జ్యోతిర్గమయా), వేణు ముల్కల (విశ్వక్‌), సంపత్‌ కుమార్‌ (సూరాపానం), గంగాధర్‌ అద్వైత (సురభి 70ఎంఎం), సూర్యతేజ(ఫోకస్‌), ధ్రువ (కిరోసిన్‌), జాన్‌ జక్కి (2020గోల్‌మాల్‌), అక్షరకుమార్‌ (షరతులు వర్తిస్తాయి), నవీన్‌ కుమార్‌ గట్టు (శరపంజరం) వంటి వారు తెలుగు సినిమా రంగానికి దర్శకులుగా పరిచయమయ్యారు.

సినివారం కోసం సంప్రదించండిలా..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి శనివారం సినివారం పేరిట రవీంద్రభారతిలోని పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. దీని కోసం రవీంద్రభారతి ప్రాంగణంలోని భాషా సాంస్కృతిక కార్యాలయంలో సంప్రదించవచ్చు. తమ సినిమా వివరాలతో అక్కడ నమోదు చేసుకోవాలి. లఘు చిత్రాల సంఖ్యను బట్టి ప్రతి శనివారం ఒకటి లేదా రెండు సినిమాలు ప్రదర్శిస్తారు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే ప్రేక్షకులతో పాటు సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్యాలయంలో నమోదు చేయడం కుదరని వారు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

సినిమా కలను సినివారంతో సాకారం చేసుకోండి
సినిమాలు, కళల ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతిభావంతుల కోసం సినివారం తలుపులు తెరిచి ఉంటాయి. మీ చలన చిత్రాలకు వేదికనందించి మీ సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేస్తాం. ప్రస్తుతం తెలంగాణ నేపథ్యమున్న కథలు, సినిమాలు...కళాకారులు, టెక్నిషియన్‌లు విజయాలు సొంతం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రతిభ లక్ష్యంగా 2016లో సినివారం ప్రారంభించాం ఈ ఎనిమిదేళ్లలో వందల లఘు చిత్రాలను తెరపై ప్రదర్శించడంతో పాటు సినీ రంగ నిపుణులతో నేరుగా పరిచయం చేసే కార్యక్రమాలు చేపట్టాం
-- డా. మామిడి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు.

Paidi Jairaj Preview Theatre Cinivaram సినివారం Sunday Cinema : A Window to World Cinema

https://www.chitrajyothy.com/2025/cinema-news/every-saturday-is-cine-week-61211.html

సినివారం (15.02.2025)''ఆభరణం'' & ''రావు గారి అబ్బాయిలు'' లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం.సాయంత్రం 6 గం.ల...
15/02/2025

సినివారం (15.02.2025)

''ఆభరణం'' & ''రావు గారి అబ్బాయిలు'' లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం.

సాయంత్రం 6 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు
15 ఫిబ్రవరి, 2025. శనివారం

పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతి
*అందరికి ఆహ్వానం*

presents
at

Sunday Cinema (03.12.2023)Soul Boy is a 2010 Kenyan drama film directed by Hawa Essuman.(Country: Kenya; Language: Swahi...
03/12/2023

Sunday Cinema (03.12.2023)

Soul Boy is a 2010 Kenyan drama film directed by Hawa Essuman.
(Country: Kenya; Language: Swahili; Run Time: 61 mins)

6pm, 03.12.2023. Sunday.
Paidi Jairaj Preview Theatre,
2nd Floor, Ravindra Bharathi.

all are welcome

presents
at




https://www.facebook.com/events/s/312201081794954/

సినివారం (02.12.2023)కెపి దర్శకత్వం వహించిన ''శశిశేఖరా'' & గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ''కలయా నిజమా'' లఘుచిత్రాల ప్రదర్...
02/12/2023

సినివారం (02.12.2023)

కెపి దర్శకత్వం వహించిన ''శశిశేఖరా'' & గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ''కలయా నిజమా'' లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం.

సాయంత్రం 6 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు
2 డిసెంబర్, 2023. శనివారం
పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతి

అందరికి ఆహ్వానం

presents
at




https://www.facebook.com/events/716283457224678/

Sunday Cinema (26.11.2023)Sweet Bean is a 2015 Japanese drama film directed by Naomi Kawase.(Country: Japan; Language: J...
26/11/2023

Sunday Cinema (26.11.2023)

Sweet Bean is a 2015 Japanese drama film directed by Naomi Kawase.
(Country: Japan; Language: Japanese; Run Time: 113 mins)

6pm, 26.11.2023. Sunday.
Paidi Jairaj Preview Theatre,
2nd Floor, Ravindra Bharathi.

all are welcome

presents
at




https://www.facebook.com/events/361790126257293/

సినివారం (25.11.2023)కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ''అనందో బ్రహ్మ'' మరియు గణేష్ దర్శకత్వం వహించిన ''వన్ బ్లడీ బుల్లెట్'...
25/11/2023

సినివారం (25.11.2023)

కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ''అనందో బ్రహ్మ'' మరియు గణేష్ దర్శకత్వం వహించిన ''వన్ బ్లడీ బుల్లెట్'' లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం.

సాయంత్రం 6 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు
25 నవంబర్, 2023. శనివారం
పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతి

అందరికి ఆహ్వానం

presents
at




https://www.facebook.com/events/6552676634841386

Sunday Cinema (19.11.2023)My Only Sunshine is a 2008 Turkish film directed by Reha Erdem.(Country: Turkey; Language: Tur...
19/11/2023

Sunday Cinema (19.11.2023)

My Only Sunshine is a 2008 Turkish film directed by Reha Erdem.
(Country: Turkey; Language: Turkish; Run Time: 112 mins)

6pm, 19.11.2023. Sunday.
Paidi Jairaj Preview Theatre,
2nd Floor, Ravindra Bharathi.

all are welcome

presents
at




https://www.facebook.com/events/371909858586436/

సినివారం (18.11.2023)విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ''పెట్రోలింగ్'' మరియు శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ''బూమ్ పోల్'' లఘుచి...
18/11/2023

సినివారం (18.11.2023)

విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ''పెట్రోలింగ్'' మరియు శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ''బూమ్ పోల్'' లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం.

సాయంత్రం 6 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు
18 నవంబర్, 2023. శనివారం
పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతి

అందరికి ఆహ్వానం

presents
at




https://www.facebook.com/events/1051201699257826/

Sunday Cinema (12.11.2023)Children's Day (14th November) Special MovieThe Boy Who Harnessed the Wind is a 2019 African d...
12/11/2023

Sunday Cinema (12.11.2023)

Children's Day (14th November) Special Movie

The Boy Who Harnessed the Wind is a 2019 African drama film written, directed by Chiwetel Ejiofor.
(Country: Malawi; Language: Chichewa; Run Time: 113 mins)

6pm, 12.11.2023. Sunday.
Paidi Jairaj Preview Theatre,
2nd Floor, Ravindra Bharathi.

all are welcome

presents
at




https://www.facebook.com/events/252676604459828/

Address

2nd Floor, Ravindra Bharathi, Lakdikapul Road, Near State Assembly, Saifabad, Lakdikapul Hyderabad
Hyderabad
500004

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Telephone

+918919997465

Website

Alerts

Be the first to know and let us send you an email when Paidi Jairaj Preview Theatre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Paidi Jairaj Preview Theatre:

Share

Category