07/07/2026
నా జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, సొసైటీ బ్యాంక్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందికి స్వీట్స్ అందించడం, అలాగే వృద్ధాశ్రమంలో పెద్దలతో కలిసి నా పుట్టినరోజును జరుపుకోవడం ద్వారా ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా మార్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏❤️
ఇది నా జన్మదినం కంటే, మనం కలిసి సమాజానికి సేవ చేయాలనే భావనకు ప్రతీకగా నిలిచింది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎంతో ప్రేమతో, అంకితభావంతో ఈ కార్యక్రమాల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను.
ప్రత్యేకంగా సాయి, ఆనంద్, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన నా స్నేహితులు, యువత సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీలాంటి మంచి మనుషులు నా చుట్టూ ఉండటం నా అదృష్టం, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం.
మీ అందరి ప్రేమ, ఆప్యాయత, ఆ�